Monday, July 16, 2012

అర్థ రాత్రి నిద్ర పోనీ అల్లరి పిల్లలతో వేగే అమ్మలకి నాన్నలకి ఈ చిన్ని కవిత అంకితం...


పగలే వెన్నెల కురిపించాడో కవి...
 నీ నవ్వుల నదీ ప్రవాహం తో అమావాస్య  నడి రేయి సైతం పండు వెన్నెల చిలికి .....తొలి పొద్దు ముద్ద మందారాలు విరబూసాయి.....  
కాని నిద్దర లేక మెదళ్ళు మొద్దు బారాయి... 
నీ ఆటల పాటల అరుపుల మెరుపులు వినసొంపులే... 
కాని వాటిలో ములిగి ఒడలు మరిచి మాడ్చిన దోసెలు తినసొంపులు కావే....
తొలి నాటి బడి లో బుడి బుడి అడుగుల బుజ్జాయి పలుకుల్లాంటి నీ చిరు "ఉ" కారాలు "అ" కారాలు వీక్షనానందలే......
కాని విసిగి వేసారి వేసే విరుపుల అరుపుల కేకలు మాత్రం కర్ణభేరి పాలిట మేకులే..
యశోదా తనయ చిన్ని కన్నయ్య లీలల లాంటి నీ క్రీడా గాథల మాలిక మామ్మ తాతల కి కలకండ పలుకులే......
కాని నీ ముద్దుల లీలల మాలల అల్లిక అమ్మ నాన్నలకి అందని మెలిక...