అదే నేను - రత్నప్రభ
అర్థరాత్రి పదకొండు అవుతుండటం వల్ల పెద్దగా ట్రాఫిక్ జాం లేదు, టైం కి ఆఫీసు కి చేరుకున్నాను. ప్రపంచం అంతా నిద్ర పోయె టైము లో ఇక్కడ సూర్యోదయం అవుతుంది. నైట్ షిఫ్ట్ కావడం వాళ్ళ ఫ్లోర్ లో పెద్ద సందడి లేదు. అక్కడక్కడా గుంపులు చేరి హ్యాండ్షేక్ లు, రాబోయే అప్రైసల్ లో కేటాయించాబోయే ఇంక్రిమెంట్లు గురించి మాట్లాడుకుంటున్నారు కొలీగ్స్ . లోపలికి రాగానే రెండు బ్లాకులు దాటితే మూడో బ్లాక్ నాది. మెయిల్ ఓపెన్ చేసి షిఫ్ట్ తాలూకు వర్క్ ఆర్డర్ తీసి పని మొదలు పెట్టాను. రోజూ చేసే పనే కాబట్టి ఇంట్రస్టు లేదు ఇబ్బంది లేదు. నాలుగు ఫైల్స్ ప్రాసెస్సింగ్ కి ఇచ్చి క్యాఫ్టిరియా లోకి అడుగు పెట్టాను.
జనవరి కావడం తో చలి వణికిన్చేస్తోంది. మా ఊరితో పోల్చుకుంటే హైదరాబాద్ లో చలి ఎక్కువగానే ఉంది.
"హేయ్ చేమీ వాట్స్ అప్ ?" పలకరించారు అప్పటికే అక్కడున్న కొలీగ్స్ . నిర్లిప్తం గా నవ్వాను.
"వాంట్ టు హేవ కాఫీ?" ఒక కొలీగ్ తన చేతిలో ఉన్న కప్ చూపిస్తూ అడిగింది.
కాఫీ, అక్కడ మిషన్ మీద కాఫీ అని రాసి ఉన్న బటన్ నొక్కితే వేడి వేడి నీళ్ళు (కాఫీ రంగు లో నే ఉంటాయి లే) వచ్చి కప్పు లో పడతాయి, దాన్నే మహాప్రసాదం గా సేవించాలి. అదే మాకు కాఫీ.
"హలో" అన్న నా కొలీగ్ మాటకి మళ్లా స్పృహ లోకి వచ్చాను .
"నో థాంక్స్" మనసులో నాయనమ్మ చేతి కాఫీ కమ్మదనం కదులుతుండగా విసుగ్గా అన్నాను.
అధునాతన సదుపాయాలతో ఉన్న ఆ గది లో ఒక పక్కగా కూర్చున్నాను, పక్కనే ఉన్న అద్దం లో కనిపిస్తున్న ప్రతిబింబం ..... నాదే ! అవును అక్షరాలా నేను, అప్పటి అదే నేను.
***************
"బారెడు పొద్దెక్కింది ఇంకా నిద్రేవిటే, తాతయ్య గారు కోప్పడతారు లేమ్మా లే!" అమ్మ పిలుస్తోంది. వసారలో రేడియో లోంచి MS సుబ్బలక్ష్మి సుప్రభాతం సన్నగా వినపడుతోంది. ఉదయం 6 గంటలకి వచ్చే భక్తిరంజని అది.
"అబ్బా ఇంకా ఆరే కదా అయ్యింది, లేస్తా లే" నా విసుగు.
-మిగిలినది రేపు చదవండి-

No comments:
Post a Comment